ఖమ్మం జిల్లాకు చెందిన అన్నపూర్ణ సుంకర అనే యువతి తెలుగు దర్శకులను కడిగిపారేసింది. ఎన్ని సినిమాలు చేసినా, ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే సినిమాలు తీసినా... హీరోయిన్లను, మహిళలను అవమానించకుండా సినిమాలు నిర్మించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 'నన్ను కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ప్రశ్న' అనే అంశంపై ఆమె మాట్లాడుతూ తన ఆవేదన వెళ్లగక్కింది. ఓ వీడియో తీసి యూట్యుబ్&లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే విశేష స్పందన వస్తోంది. మహిళలను ఉద్దేశిస్తూ తెలుగు సినిమాల్లో ప్రదర్శించే తీరు తనను తీవ్రంగా వేధిస్తోందని వాపోయింది. ఇటీవల బాహుబలి సినిమాలో ప్రభాస్& తమన్నా మధ్య ఓ పాట సన్నివేశం అందుకు ఉదాహరణ చెప్పింది. శివగామి పాత్రను ఓ ఎత్తులో నిలబెట్టిన రాజమౌళి... చివరకు ఆ సన్నివేశం తీయకుండా ఉండలేకపోయారని విమర్శించింది. ప్రభాస్& తమన్నా మధ్య సన్నివేశం అమ్మాయిలను అవమానపరిచేలా ఉందని చెప్పింది. ఒకర్ని అవమానిస్తే కామెడీ, కొడితే ఎంటర్టైన్మెంట్ రేప్ గురించి మాట్లాడితే అది ఫన్నీగా మారిపోయే స్థితిలో తెలుగు సినిమాలు ఉన్నాయని వాపోయింది. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్. పెద్ద వయస్కుడైన ఎంఎస్ నారాయణను ఎలా కొడతాడని ప్రశ్నించింది. దూకుడు సినిమాలో మహేష్&బాబు.. సమంతను 'నీ కలరేంటి? నా కలరేంటి?' అంటూ మాట్లాడటాన్ని తప్పుబట్టింది. కమెడియన్& అలీ ఒక సందర్భంలో హీరోయిన్;పై, ఓ యాంకర్పై చేసిన కామెంట్&పై సుంకర స్పందిస్తూ... అలీ మనిషా..? దున్నపోతా..? అని ఆగ్రహించింది. 'ఇలా మహిళలను కించపరిచే మరెన్నో సినిమాలు, అసభ్య పదజాలాలు సమాజాభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయి. కేవలం డబ్బుల కోసమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే సినిమాలు తీయండి. సినిమా విధానాలు మార్చి తీయండి తప్పక చూస్తాం. ప్రేక్షకులు కూడా హీరోలను పూజించడం మానుకోవాలి' అంటూ సూచించింది. అన్నపూర్ణ సుంకర తన ఆవేదనను తెలియజేసిన ఈ వీడియోను మీరూ వీక్షించండి





Advertisement

0 comments:

Post a Comment

 
Top